గుత్తి మున్సిపల్ పీఠం టీడీపీకి ఏకగ్రీవం

అనంతపురం జిల్లా గుత్తి మున్సిపల్ చైర్‌పర్సన్‌గా టీడీపీ అభ్యర్థి గోవిందరాజులు తమిళ్ సెల్వి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సోమవారం మున్సిపల్ కార్యాలయంలో ఎన్నికల ప్రక్రియ చేపట్టారు. చైర్‌పర్సన్ పదవికి దాఖలైన 8 నామినేషన్లలో 6 తిరస్కరణకు గురయ్యాయి. వైసీపీ అభ్యర్థి అంజలి నామినేషన్ తిరస్కరణకు గురికాగా, మరో టీడీపీ అభ్యర్థి నామినేషన్ ఉపసంహరించుకున్నారు. దీంతో తమిళ్ సెల్వి ఎన్నిక ఏకగ్రీవమైంది.



