రోడ్డు ప్రమాదం.. మహిళ దుర్మరణం

తిరుపతి జిల్లా దొరవారిసత్రం మండలం నేలబల్లి హైవే వద్ద మంగళవారం ఉదయం ప్రమాదం జరిగింది. విజయదశమికి గుడికి వెళ్లి వస్తుండగా వర్షం కారణంగా బైక్ అదుపుతప్పి కిందపడటంతో వెనుక వస్తున్న వాహనం తగిలి ఒక మహిళ అక్కడికక్కడే మృతి చెందారు. ఆమెతో పాటు ఉన్న భర్త, కుమారుడికి స్వల్ప గాయాలయ్యాయి. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను 108 ద్వారా ప్రభుత్వాసుపత్రికి తరలించారు.



