← Back to news

రాయిమామిడి బ్రిడ్జికి ముప్పు.. రాకపోకలకు ప్రమాదం

By Korra Arun Kumar· 2h ago· Alluri Sitharama Raju
రాయిమామిడి బ్రిడ్జికి ముప్పు.. రాకపోకలకు ప్రమాదం

అల్లూరి సీతారామరాజు జిల్లా పెదబయలు మండలం గోమంగి పంచాయతీలో రాయిమామిడి నుంచి గుల్లెలు గ్రామానికి వెళ్లే ప్రధాన రహదారిపై ఉన్న మాత్యగడ్డ కాజ్‌వే బ్రిడ్జి ప్రమాదకరంగా మారింది. బ్రిడ్జి ఒకవైపు అంచు కోతకు గురై మట్టి, బండరాళ్లు కొట్టుకుపోయాయి. ఈ మార్గంలో జీపులు, ద్విచక్ర వాహనాలు, పాదచారులు నిత్యం రాకపోకలు సాగిస్తుండటంతో ప్రమాద భయం నెలకొంది. అధికారులు స్పందించి మరమ్మతులు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.

More in Local