← Back to news

ప్లాస్టిక్ వేటలో NSS..! 150 మంది వాలంటీర్ల స్పందన

By rajaratnam· 3d ago
ప్లాస్టిక్ వేటలో NSS..! 150 మంది వాలంటీర్ల స్పందన

గుంటూరు జిల్లా ఆచార్య, నాగార్జున విశ్వవిద్యాలయంలో ప్లాస్టిక్ నిర్మూలనకు భారీ స్పందన వచ్చింది. గోల్డెన్ జూబ్లీ వేడుకల్లో భాగంగా ఇంజినీరింగ్ కాలేజ్ NSS యూనిట్ ఈ కార్యక్రమం చేపట్టింది. సుమారు 150 మంది వాలంటీర్లు విశ్వవిద్యాలయ ప్రాంగణంలో ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరించి, పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వల్ల కలిగే నష్టాలను వివరిస్తూ, వినియోగాన్ని తగ్గించాలని పిలుపునిచ్చారు.<br>ప్రిన్సిపాల్ లింగరాజు, NSS కోఆర్డినేటర్ దివ్య తేజోమూర్తి మార్గదర్శకత్వంలో ఈ డ్రైవ్ జరిగింది.

ప్లాస్టిక్ వేటలో NSS..! 150 మంది వాలంటీర్ల స్పందన

More in Local

కరెంట్ కోసం చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో
Local· 1m ago

కరెంట్ కోసం చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో

TG: కరెంట్ కోతలతో విసిగిపోయిన మహబూబాబాద్ జిల్లా మునిగలవీడు గ్రామస్తులు చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో చేపట్టారు. శుక్రవారం రాత్రి మహబూబాబాద్–తొర్రూరు రహదారిపై విద్యుత్ సబ్‌స్టేషన్ ఎదుట ఆందోళన నిర్వహించడంతో వాహనాలు నిలిచిపోయాయి. ప్రభుత్వం కరెంట్ కోతలు లేవని చెబుతున్నా రోజులో పలుమార్లు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నారని గ్రామస్తులు ఆరోపించారు. సాయంత్రం, రాత్రి వేళల్లో కోతలు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు అధికారులతో మాట్లాడి విద్యుత్ సరఫరా పునరుద్ధరిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.