అది ముమ్మాటికీ రాజకీయ ప్రేరేపితమే: మహేష్ గౌడ్

TG: మీనాక్షి నటరాజన్ నామినేషన్‌ను ఏకపక్షంగా తిరస్కరించడంపై TPCC అధ్యక్షుడు మహేష్‌కుమార్ గౌడ్ స్పందించారు. బీజేపీ రాజ్యాంగ వ్యవస్థలను అడ్డం పెట్టుకుని ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందన్నారు. రాజకీయ కక్షసాధింపు చర్యల్లో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నారని ఫైరయ్యారు. మధ్యప్రదేశ్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి తన పరిధికి మించి వ్యవహరించారని విమర్శించారు. ఓ ప్రైవేట్ వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదును, నోటీసులను సాకుగా చూపి నామినేషన్‌ను రిజెక్ట్ చేయడం రాజకీయ ప్రేరేపితమేనని ఆరోపించారు.


