ప్రజలు ఇచ్చిన ఫిర్యాదులను వెంటనే తీర్చాలి

AP : ప్రజావాణిలో జనం ఇచ్చిన వినతులను త్వరగా చూసి, చెప్పిన టైమ్‌లో సమస్యలు తీర్చాలని నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ అధికారులను ఆదేశించారు. పనులు ఏమైనయ్యో అర్జీలు ఇచ్చిన జనానికి కూడా కచ్చితంగా చెప్పాలన్నారు. కలెక్టరేట్‌లో జరిగిన కార్యక్రమంలో ప్రజల నుంచి 42 వినతులు వచ్చాయి. కాగితం తీసుకోగానే పని అయిపోదని, సమస్య పూర్తిగా తీరేదాకా అధికారులదే బాధ్యత అని చెప్పారు. వేరే శాఖల సమస్యలు ఉంటే వెంటనే వాళ్లతో మాట్లాడి సమస్యను తీర్చాలన్నారు.



