← Back to news

కాంగ్రెస్ బలోపేతానికి ఐక్యంగా పనిచేయాలి

By Ashok Ganapuram· 1h ago· Kesamudram, Kesamudram, Mahabubabad
కాంగ్రెస్ బలోపేతానికి ఐక్యంగా పనిచేయాలి

TG: మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నూతనంగా ఎన్నికైన చిలువేరు సమ్మయ్య గౌడ్‌ను కాట్రపల్లి గ్రామ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు జల్లే యాకాంబరం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి నాయకులు, కార్యకర్తలు ఐక్యంగా కృషి చేయాలని సూచించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అర్హులైన పేదలకు చేరేలా పనిచేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొని నూతన మండల అధ్యక్షుడు సమ్మయ్య గౌడ్‌కు శుభాకాంక్షలు తెలిపారు.

More in Local