← Back to news

వినాయక మండపాల అనుమతులు ఇక సులభం

By B V Appalanaidu· 2h ago· Yandapallivalasa, Araku Valley, Alluri Sitharama Raju
వినాయక మండపాల అనుమతులు ఇక సులభం

AP: అల్లూరి సీతారామరాజు జిల్లా అరకు సర్కిల్ పరిధిలో వినాయక చవితి మండపాలు, పందిళ్ల ఏర్పాటుకు అనుమతులు సులభంగా పొందవచ్చని సీఐ ఏ. కోటేశ్వరరావు తెలిపారు. అరకులోయ, డుంబ్రిగూడ, అనంతగిరి మండలాల ప్రజలు www.ganeshutsav.net ద్వారా ఉచితంగా దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. పోలీస్, అగ్నిమాపక, విద్యుత్, రెవెన్యూ శాఖల సమన్వయంతో అనుమతులు జారీ చేస్తామని తెలిపారు. అనుమతి పొందిన వారికి QR Codeతో డిజిటల్ అనుమతి పత్రం అందిస్తామని పేర్కొన్నారు. వినాయక ఉత్సవ నిర్వాహకులు ముందుగానే దరఖాస్తు చేసుకోవాలని సీఐ సూచించారు.

More in Local