← Back to news

ఏకగ్రీవంగా ప్రెస్‌క్లబ్ నూతన కమిటీ ఎన్నిక

By Ashok Ganapuram· 1h ago· Narsimhulapet, Narsimhulapet, Mahabubabad
ఏకగ్రీవంగా ప్రెస్‌క్లబ్ నూతన కమిటీ ఎన్నిక

TG: మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండల ప్రెస్‌క్లబ్ నూతన కార్యవర్గాన్ని ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా సలుగు నాగన్న, ప్రధాన కార్యదర్శిగా చెలిమల్ల గణేష్ ఎన్నికయ్యారు. సహాయ కార్యదర్శిగా భుక్య రమేష్, ఉపాధ్యక్షులుగా నిమ్మల నరేష్, బత్తిని సతీష్, కోశాధికారిగా ఎర్ర వెంకట్రాం నర్సయ్య, గౌరవ అధ్యక్షుడిగా గడ్డి యాకన్న, గౌరవ సలహాదారుగా చౌడారపు శ్రీనివాస్ ఎంపికయ్యారు. నూతన కార్యవర్గం పాత్రికేయుల సంక్షేమం, హక్కుల పరిరక్షణతోపాటు బాధ్యతాయుత జర్నలిజానికి కృషి చేస్తామని తెలిపింది.

More in Local