← Back to news

స్టూడెంట్ కాలర్ పట్టుకుంటే.!

By Krishna· 2h ago· X

గుజరాత్.. అహ్మదాబాద్‌లోని నిర్మా యూనివర్శిటీలో సెప్టెంబర్ 18 నుంచి 20 మధ్య టెక్నోఫోరా ఈవెంట్‌ జరిగింది. అందులో ప్రొఫెసర్ HK పటేల్ మాట్లాడుతుండగా ఓ విద్యార్థి ‘జల్దీ కర్, పన్వేల్ నికల్నా హై’ అని అనడంతో.. స్టూడెంట్‌ని స్టేజ్‌పైకి పిలిచి కాలర్ పట్టుకొని ‘ఫ్యాకల్టీని అవమానిస్తే ఏమైనా చేస్తా’ అని ప్రొఫెసర్ బెదిరించారు. యూనివర్సిటీ ముగ్గురితో కమిటీ వేసింది. రెండువైపులా క్షమాపణలు చెప్పుకున్నారు. ఇప్పుడు NSUI కార్యకర్తలు వర్శిటీ గేటు దగ్గర ప్రొటెస్ట్ చేస్తూ.. స్టూడెంట్స్‌కి సేఫ్టీ కోసం డిమాండ్ చేశారు.

More in National