ఆగస్టులో రోడ్డేశారు.. సెప్టెంబరులో పగుళ్లిచ్చింది
లక్నోలోని ఏకానా స్టేడియం దగ్గర వేసిన కొత్త రోడ్డు భారీ వర్షాలకు కుంగిపోయింది. ఆగస్టులో ఈ రోడ్డు వేశారు. భారీ వర్షాలు పడటంతో రోడ్డుకు క్రాక్స్ వచ్చాయి. పక్కనే 30 అడుగుల లోతులో తవ్వకాలు జరుగుతున్నాయి. వర్షం నీళ్లు నేలలోకి వెళ్లడంతో రోడ్డు కుంగిపోయిందని అధికారులు తెలిపారు. LDA(Lucknow Development Authority) రోడ్డును క్లోజ్ చేసి, కాంట్రాక్టర్‌తో రిపేర్ చేయిస్తోంది. దీనిపై కాంగ్రెస్ స్పందిస్తూ.. ఇది బీజేపీ ‘Corrruption Model’ అని ఎక్స్‌లో ఆరోపించింది.



