← Back to news

వినాయక చవితికి డీజేలకు అనుమతులు ఇవ్వొద్దు

By DK· 2d ago
వినాయక చవితికి డీజేలకు అనుమతులు ఇవ్వొద్దు

TG: వినాయక చవితి వేడుకల్లో డీజేలకు అనుమతులు ఇవ్వొద్దని ఖమ్మం జిల్లా డీవైఎఫ్ఐ ప్రధాన కార్యదర్శి బొడ్డు మధు పోలీసులను కోరారు. మధిర పట్టణంలోని జరిగిన డీవైఎఫ్ఐ టౌన్ కమిటీ సమావేశంలో ఆయన ఈ డిమాండ్ చేశారు. అనంతరం మధిర టౌన్ సీఐకి వినతిపత్రం అందజేశారు. డీజేలతో అధిక శబ్ద కాలుష్యం ఏర్పడి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. యువత గంజాయి, డ్రగ్స్, మద్యానికి దూరంగా ఉండేలా ప్రభుత్వం, పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.

More in Local