← Back to news

గంజాయి సాగు.. తండ్రీకొడుకులు అరెస్ట్

By BK· 2h ago· కుమ్రంభీం ఆసిఫాబాద్
గంజాయి సాగు.. తండ్రీకొడుకులు అరెస్ట్

కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ పోలీస్ స్టేషన్ లిమిట్స్‌లో వ్యవసాయ భూమిలో అంతర పంటగా గంజాయి సాగు చేస్తున్న తండ్రీకొడుకులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి పొలం నుంచి ఏకంగా 1,245 గంజాయి మొక్కలతో పాటు 11 గ్రాముల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. సీజ్ చేసిన మొక్కల వాల్యూ దాదాపు 1.50 కోట్లు ఉంటుందని SP నితికా పంత్ తెలిపారు. గంజాయి సాగు, ట్రాన్స్‌పోర్ట్ చేస్తే కఠిన చర్యలు ఉంటాయని వార్నింగ్ ఇచ్చారు.

More in Local