రెండు నెలల్లో ROB, RUB పనులు పూర్తి

ఆదిలాబాద్ పట్టణంలో ట్రాఫిక్ సమస్యలకు పరిష్కారం చూపేలా ROB, RUB నిర్మాణ పనులను మరో రెండు నెలల్లో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఎమ్మెల్యే పాయల్ శంకర్ తెలిపారు. పట్టణంలోని రైల్వే అండర్ బ్రిడ్జి నిర్మాణ పనులను ఆయన పరిశీలించి, అధికారులను పనుల పురోగతిపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. గతంలో రాష్ట్ర ప్రభుత్వం తన వాటా నిధులు విడుదల చేయకపోవడంతో పనుల్లో జాప్యం జరిగిందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. పనులు పూర్తయితే తెలంగాణ-మహారాష్ట్ర రహదారిపై ట్రాఫిక్ ఇబ్బందులు తగ్గుతాయని అన్నారు.


