నల్లకుంటలో టీచర్స్ డే వేడుకలు

నల్లకుంట పాఠశాలలో టీచర్లు, స్టూడెంట్స్ టీచర్స్ డే వేడుకలు నిర్వహించారు. మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో పాల్గొన్న ప్రధానోపాధ్యాయులు (FAC) ముత్యాల రవీందర్ మాట్లాడుతూ ఉపాధ్యాయులు విద్యార్థుల భవిష్యత్ నిర్మాతలని అన్నారు. దేశ భవిష్యత్ తరగతిలో నిర్మాణమైతే, ఆ భవిష్యత్ నిర్మించే సామాజిక ఇంజనీర్లే టీచర్లు అన్నారు. కార్యక్రమంలో టీచర్లు కవిత, సుజిత, ప్రశాంతి, రమేష్, దుర్గ, అనిత , ఉదయశ్రీ, హిమ బిందు పాల్గొన్నారు.




