రాహుల్‌కు అండగా.. జగ్గారెడ్డి

TG: రాహుల్ గాంధీ పోరాటానికి మద్దతుగా TPCC వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, ఆయన భార్య DCC అధ్యక్షురాలు నిర్మల జగ్గారెడ్డి, సంగారెడ్డిలోని అంబేద్కర్ విగ్రహం దగ్గర దీక్ష చేపట్టారు. దేశ ప్రజల సంక్షేమం, రాజ్యాంగాన్ని కాపాడేందుకు రాహుల్ గాంధీ పోరాడుతున్నారని అన్నారు. ఆయన ఎన్ని రోజులు పోరాటం చేస్తే అన్నిరోజులు దీక్షలో కూర్చుంటానని చెప్పారు, ECని అడ్డుపెట్టుకుని BJP కుట్రలు చేస్తోందని, జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేసే వరకు పోరాటం కొనసాగిస్తామని జగ్గారెడ్డి తెలిపారు..
