MBBS సీట్ల స్కామ్.. దొరికిపోయిన 37 మంది!

తెలంగాణలో ఫేక్ ST సర్టిఫికెట్లతో MBBS సీట్లు పొందాలని చూసిన 37 మందిపై కాళోజీ వర్సిటీ సీరియస్ యాక్షన్ తీసుకుంది. వీరంతా వేరే రాష్ట్రాలకు చెందిన వారని, ఇక్కడి రిజర్వేషన్ బెనిఫిట్స్ కోసం ఫేక్ డాక్యుమెంట్స్ సమర్పించారని ట్రైబల్ వెల్ఫేర్ రిపోర్ట్‌లో ప్రూవ్ అయింది. దీంతో వర్సిటీ వారిని ST కేటగిరి నుండి తొలగించి, ఇకపై జనరల్ మెరిట్ కిందే ఛాన్స్ అని స్పష్టం చేసింది. ఆల్రెడీ సీట్లు పొందిన 9 మంది అడ్మిషన్లను రద్దు చేసింది.

