← Back to news

అంబేద్కర్ భారీ విగ్రహానికి 50లక్షలు మంజూరు

By మబ్బు భాను ప్రకాష్· 1h ago· Kalwakurthy (Ct), Kalwakurthy, Nagarkurnool
అంబేద్కర్ భారీ విగ్రహానికి 50లక్షలు మంజూరు

నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తి పట్టణంలో బిఆర్. అంబేద్కర్ భారీ కాంస్య విగ్రహం ఏర్పాటుకు 50 లక్షలు మంజూరయ్యాయి. పట్టణంలోని చౌరస్తాల అభివృద్ధిలో భాగంగా అంబేద్కర్ విగ్రహాన్ని అద్భుతమైన డిజైన్‌తో ఏర్పాటు చేయాలని కౌన్సిలర్ మబ్బు రామరాజు కల్వకుర్తి MLA కసిరెడ్డి నారాయణరెడ్డి, మున్సిపల్ చైర్మన్‌కు ప్రతిపాదనలు అందించారు. దీనిపై వారు సానుకూలంగా స్పందించి విగ్రహం ఏర్పాటుకు 50 లక్షలు మంజూరు చేశారు.

More in Local