← Back to news

ఆరావళి పర్వతాలపై విత్తన బంతులు.. మహిళల కృషి!

By Anusha· 1d ago
ఆరావళి పర్వతాలపై విత్తన బంతులు.. మహిళల కృషి!

రాజస్థాన్‌.. రాజ్‌సమంద్ జిల్లాలో పచ్చదనం పెంచేందుకు మహిళల బృందం కొత్త కార్యక్రమం చేపట్టింది. సంప్రదాయ వడిసెల వంటి పరికరాలతో ఆరావళి పర్వతాలపై విత్తన బంతులను విసురుతున్నారు. మొక్కలు నాటేందుకు వీలుకాని దట్టమైన ప్రాంతాల్లో కూడా విత్తనాలు చేరేలా కృషి చేస్తున్నారు. మట్టి, సేంద్రియ ఎరువులతో చేసిన ఈ విత్తన బంతులు.. వర్షాలకు నేలలో కలిసిపోయి మొలకెత్తుతాయి. 8 ఏళ్లుగా ఇలా చేస్తున్నారు. ఇప్పటివరకు 1లక్షా 50వేల విత్తన బంతులను వెదజల్లగా.. ఈ ఏడాది మరో 50 వేల బంతులు విసరాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

More in Viral

Super Marketలో షాపింగ్ చేస్తున్నారా? బిల్‌ చెక్ చేయాల్సిందే!
Viral· 1d ago

Super Marketలో షాపింగ్ చేస్తున్నారా? బిల్‌ చెక్ చేయాల్సిందే!

AP: మచిలీపట్నం సూపర్‌మార్కెట్‌లో జరిగిన ఓ ఘటన నేపథ్యంలో షాపింగ్‌ విషయంలో కస్టమర్లకు <a href="https://x.com/telugodikeka/status/2098256314342523224">ఓ అలర్ట్‌ వైరల్‌ అవుతోంది.</a> షాపింగ్‌ చేసేటప్పుడు బోర్డుపై కనిపించిన రేట్‌ చూసి ఐటమ్స్‌ బుట్టలో వేసుకోవడం, బిల్‌ వచ్చాక చెక్ చేయకుండా పే చేయడం చేస్తుంటాం. ముఖ్యంగా ఎక్కువ ఐటమ్స్‌ కొంటే ధరలు గుర్తుండవు. అందుకే ప్రతి ఐటమ్‌ రేట్‌ను ముందే ఫొటో తీసుకోవడం, బిల్‌ వచ్చిన తర్వాత ఒక్కో ప్రైస్‌ను క్రాస్‌ చెక్‌ చేయడం మంచిది. లేకపోతే దగ్గర్లోని కిరాణా షాపులో ధరలు పోల్చి కొనడం ద్వారా ఖర్చు తగ్గించుకోవచ్చు.