టార్గెట్ పవన్ కళ్యాణ్.. అన్వేష్ సెటైర్
యూట్యూబర్ అన్వేష్ మళ్లీ యాక్టివ్ అవుతున్నారు. రోజుకో రకమైన వీడియో సందేశం ఇస్తూ.. తనదైన స్టైల్‌లో సెటైర్లు వేస్తున్నారు. తాజాగా భారత దేశానికి క్యాన్సర్ వచ్చేసిందంటూ.. AP DCM పవన్ కళ్యాణ్‌ని టార్గెట్ చేశారు. వినాయక చవితికి మట్టి విగ్రహాలే వాడాలి అనే సందేశం ఇస్తూనే.. ఇండియా పరిస్థితి దారుణంగా తయారైందనీ, దేశానికి కాలుష్య క్యాన్సర్ పట్టుకుందని చెబుతూ వీడియో చేశారు. తాను రష్యాలో ప్రజలకు మట్టి విగ్రహాలు తయారుచేసి ఇస్తానని మాట ఇచ్చానని అన్వేష్ అన్నారు. ఈ <a href="https://www.instagram.com/p/DdK6qdgTIhG/">వీడియో</a> వైరల్ అవుతోంది.



