← Back to news

కలుషిత నీటితో అనారోగ్యం.. గ్రామస్థుల అవస్థలు

By Durga Prasad Dany· 1d ago· Uddandapuram, Nakkapalli, Anakapalli

అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం ఉద్దండపురం గ్రామంలో గత మూడు నెలలుగా తాగునీటి సమస్య తీవ్రంగా మారింది. నల్లాలు, పైపుల ద్వారా పసుపు రంగులో మురుగునీరు సరఫరా అవుతుండటంతో గ్రామస్తులు, చిన్నపిల్లలు అనారోగ్యానికి గురవుతున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే పలువురు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని తెలిపారు. అధికారులు వచ్చి పరిశీలించి వెళ్తున్నా సమస్యకు శాశ్వత పరిష్కారం లభించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

More in Local