పర్యావరణ పరిరక్షణకు మట్టి గణపతులు: తలసాని

TG: మట్టి గణపతి విగ్రహాలను పూజించి పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మాజీ మంత్రి, సనత్‌నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ కోరారు. హైదరాబాద్ వెస్ట్ మారేడ్‌పల్లిలోని తన క్యాంపు కార్యాలయం వద్ద మట్టి గణపతి విగ్రహాలను భక్తులకు పంపిణీ చేశారు. పీఓపీ, ప్రమాదకర రంగులతో తయారు చేసిన విగ్రహాలను నిమజ్జనం చేయడం వల్ల నీరు కలుషితమయ్యే ప్రమాదం ఉందన్నారు. మట్టి విగ్రహాలను ప్రతిష్ఠించి పూజించడం ద్వారా పర్యావరణానికి మేలు జరుగుతుందని తెలిపారు. ఈ అంశంపై ప్రజల్లో అవగాహన కల్పించాలని కోరారు.



