← Back to news

ఆలయంలో విగ్రహాల తొలగింపు

By KUCHIPUDI BUJJIBABU· 1d ago· Bhadravathi Nagar, Mangalagiri, Guntur

గుంటూరు జిల్లా మంగళగిరిలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో జయవిజయుల విగ్రహాలతో పాటు గరుత్మంతుని విగ్రహాన్ని కూడా తొలగించారు. ఆలయంలో చేపడుతున్న పనుల్లో భాగంగా ఈ విగ్రహాలను తొలగించారు. ఆలయంలో ఎంతో ప్రాధాన్యం ఉన్న విగ్రహాలను తొలగించడంతో భక్తుల్లో ఆసక్తి నెలకొంది. వాటిని తిరిగి ప్రతిష్ఠిస్తారా? ఆలయంలో ఇంకా ఎలాంటి పనులు చేపట్టనున్నారు? అనే విషయాలపై భక్తులు స్పష్టత కోరుతున్నారు. ఈ వ్యవహారంపై ఆలయ అధికారులు వివరాలు వెల్లడించాల్సి ఉంది.

More in Local