గుంతకల్లు మార్కెట్ యార్డులో తూనికల తనిఖీ

గుంతకల్లు మార్కెట్ యార్డులో వ్యాపారులు వినియోగిస్తున్న తూనికల పరికరాలను తూనికలు-కొలతల శాఖ అధికారులు ఇవాళ తనిఖీ చేశారు. పౌరసరఫరాల విజిలెన్స్ కమిటీ సభ్యురాలు వనగొంది విజయలక్ష్మి సమక్షంలో పరికరాల వెరిఫికేషన్తో పాటు కొత్త స్టాంపింగ్ ప్రక్రియ చేపట్టారు. వినియోగదారులకు సరైన తూకం అందించేందుకు వ్యాపారులు తమ పరికరాలను క్రమం తప్పకుండా తనిఖీ చేయించుకోవాలని విజయలక్ష్మి సూచించారు.




