← Back to news

నల్లబెల్లిలో కల్తీ పొటాష్‌ కలకలం

By Ramesh Ch· 10h ago· Nallabelly, Nallabelli, Warangal
నల్లబెల్లిలో కల్తీ పొటాష్‌ కలకలం

వరంగల్ జిల్లా నల్లబెల్లి మండల కేంద్రంలోని గ్రోమోర్‌ సెంటర్‌లో కల్తీ కోరమండల్‌ పొటాష్‌ విక్రయించారనే ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. కొండాయిల్పల్లికి చెందిన రైతు కొనకటి రాజు మూడు బస్తాలు కొనగా, వాటిలో మట్టి ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. గోదాములోని మరో బస్తాలోనూ ఇదే పరిస్థితి కనిపించిందని రైతులు తెలిపారు. ఇటీవల 294 బస్తాలు రాగా, 150 వరకు విక్రయించినట్లు ఆరోపించారు. అధికారులు విచారణ చేసి నాణ్యతపై స్పష్టత ఇవ్వాలని రైతులు కోరుతున్నారు.

More in Local