మిడ్జిల్ సహా పలు ప్రాంతాల్లో వైద్య కేంద్రాలు సీజ్

మహబూబ్నగర్ జిల్లాలో నిబంధనలకు విరుద్ధంగా వైద్యం అందిస్తున్న ఐదు ప్రథమ చికిత్స కేంద్రాలను సీజ్ చేసినట్లు జిల్లా వైద్యాధికారి శ్రీనివాసులు తెలిపారు. మంగళవారం మిడ్జిల్, బోయినిపల్లి, కొత్తపల్లి, బాలానగర్ మండలం హేమాజీపూర్, నవాబ్పేట మండలం కాకర్లపహాడ్లో తనిఖీలు నిర్వహించారు. ఆయా కేంద్రాల్లో యాంటీబయాటిక్ ఇంజెక్షన్లు, ఐవీ ఫ్లూయిడ్స్, నెబ్యులైజర్తో చికిత్స చేస్తున్నట్లు గుర్తించారు.



