ఆధార్‌లో పేరు, అడ్రస్ తప్పులున్నాయా? ఇక ఈజీగా మార్చుకోండి!

ఆధార్ కార్డులో పేరు, ఇంటిపేరు, అడ్రస్‌లో స్పెల్లింగ్ తప్పులను సరిచేసుకునేందుకు <a href="https://uidai.gov.in/hi">UIDAI</a> కొత్త రూల్స్ తీసుకొచ్చింది. పెళ్లి లేదా విడాకుల తర్వాత మహిళలు ఇంటిపేరు మార్చుకోవచ్చు. రెండు పేర్లు ఉన్నవారు కూడా నచ్చిన ఒక పేరును ఆధార్‌లో ఉంచుకోవచ్చు. ఇందుకోసం అవసరమైన డాక్యుమెంట్లతో ఆధార్ కేంద్రానికి వెళ్లి 75 రూపాయలు చెల్లించాలి. పేరును పూర్తిగా మార్చాలంటే మాత్రం ఆఫీషియల్ గెజిట్ నోటిఫికేషన్ తప్పనిసరి. ఆధార్ వివరాల్లో తప్పులుంటే ఈ అవకాశాన్ని యూజ్ చేసుకోవచ్చు.



