జూరాల మార్గంలో గద్వాలకు రాకపోకలు బంద్

వనపర్తి జిల్లా లోయర్ జూరాల పవర్ ప్లాంట్ నుంచి వాటర్ రిలీజ్ చేయడంతో జూరాల మీదుగా గద్వాల వెళ్లే రోడ్డును క్లోజ్ చేసినట్లు ఆత్మకూరు ఎస్సై జయన్న చెప్పారు. ఈ రూట్లో ట్రాఫిక్ నిలిపివేశామని, ఆత్మకూరు నుంచి గద్వాల వెళ్లే ప్రయాణికులు ఇబ్బంది పడకుండా ఆల్టర్నేటివ్ రూట్స్ ఎంచుకోవాలని ఆయన ప్రెస్నోట్లో సూచించారు.



