మహిళపై హత్యాయత్నం.. నిందితుడికి ఏడేళ్ల జైలుశిక్ష

నిజామాబాద్ జిల్లా బూరుగుగల్లీకి చెందిన జంబిలం దిలీప్‌కు మహిళపై హత్యాయత్నం చేసిన కేసులో ఏడేళ్ల కఠిన కారాగార శిక్ష, 1,000 రూపాయల జరిమానా విధిస్తూ జిల్లా సెషన్స్ న్యాయమూర్తి జీవీఎన్ భారతలక్ష్మి తీర్పు ఇచ్చారు. జరిమానా చెల్లించకపోతే అదనంగా మూడు నెలల జైలు శిక్ష అనుభవించాలని ఆదేశించారు. తల్లి, భార్యను దిలీప్ వేధిస్తుండగా అడ్డుకున్న పొరుగింటి మహిళ రేషం లక్ష్మిపై దాడి చేసి హత్యకు యత్నించినట్లు కేసు నమోదైంది.



