← Back to news

బీజేపీ ప్రభుత్వం తీరుపై శశిథరూర్ మండిపాటు

By Vishi· 5d ago
బీజేపీ ప్రభుత్వం తీరుపై శశిథరూర్ మండిపాటు

ఢిల్లీలో జరుగుతున్న అరెస్టులు, నిరసనల అణచివేతపై కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. జంతర్‌మంతర్ వద్ద శాంతియుతంగా ఆందోళన చేస్తున్న యువతను, జాతీయ జెండాలు పట్టుకున్న వారిని జ్యుడీషియల్ కస్టడీకి పంపడంపై ఆయన అభ్యంతరం తెలిపారు. అంకిత భండారి కేసులో న్యాయం కోరుతూ ఇండియా గేట్ వద్ద నిరసన తెలుపుతున్న ఆమె తల్లిదండ్రులు, కాంగ్రెస్ కార్యకర్తలను తెల్లవారుజామున పోలీసులు అదుపులోకి తీసుకోవడాన్ని ఆయన తప్పుబట్టారు.

More in National