← Back to news

ప్రపంచానికి ఎల్‌నినో ముప్పు!

By A.Ajay· 2h ago
ప్రపంచానికి ఎల్‌నినో ముప్పు!

పసిఫిక్ మహాసముద్రంలో నీటి ఉష్ణోగ్రతలు పెరగడంతో ఎల్‌నినో ప్రభావం ప్రపంచ వాతావరణంపై పడనుంది. దీంతో కొన్ని ప్రాంతాల్లో తీవ్రమైన వేడి, మరికొన్ని చోట్ల కరువు, భారీ వర్షాలు వచ్చే ప్రమాదం ఉంది. అమెరికాలోని చికాగో విశ్వవిద్యాలయ పరిశోధకుల అంచనా ప్రకారం, ఇప్పటి నుంచి 2027 ఫిబ్రవరి వరకు సాధారణ సంవత్సరాలతో పోలిస్తే వేడి కారణంగా ప్రపంచవ్యాప్తంగా అదనంగా 4.51 లక్షల మరణాలు సంభవించే అవకాశం ఉంది. ముందస్తు హెచ్చరికలు, వైద్య సదుపాయాలు, కల్పించడం ద్వారా ప్రాణనష్టాన్ని తగ్గించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.

More in International