మళ్లీ రెచ్చిపోయిన నార్త్ కొరియా!

నార్త్ కొరియా మరోసారి బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించడంతో ఈస్ట్ ఆసియాలో ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఈరోజు జపాన్ సముద్రం వైపు నార్త్ కొరియా పలు బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించింది. ఈ విషయాన్ని సౌత్ కొరియా సైన్యం వెల్లడించింది. ప్రయోగించిన క్షిపణుల్లో కొన్ని 900 కిలోమీటర్లకు పైగా దూరం ప్రయాణించినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. మరోవైపు, ప్రయోగించిన 2 క్షిపణులు బయట సముద్రంలో పడి ఉండవచ్చని జపాన్ తెలిపింది. దీనిపై సౌత్ కొరియా ఆందోళన వ్యక్తం చేసింది.



