నర్సరీలకే పరిమితమైన పచ్చదనం

ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలోని పలు గ్రామ పంచాయతీ నర్సరీల్లో మొక్కలు ఎండిపోతున్నాయి. పచ్చదనం పెంచాలనే లక్ష్యంతో ప్రభుత్వం వన మహోత్సవం కోసం వేలాది మొక్కలను పెంచుతున్నా, వాటిని సకాలంలో నాటడం, నీరు పోసి సంరక్షించడం లేదనే విమర్శలు వస్తున్నాయి. మొక్కల పెంపకానికి సంచులు నింపి, విత్తనాలు వేసి సిబ్బంది శ్రమిస్తున్నా సరైన నిర్వహణ లేకపోవడంతో ఆశించిన ఫలితం రావడం లేదు. దీంతో ప్రజాధనం వృథా అవుతోందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.




