అందుకే ఆ నిర్ణయం తీసుకున్నా: సమంత

ఒకానొక టైంలో నటనకు పూర్తిగా గుడ్‌బై చెప్పాలని అనుకున్నానని నటి సమంత తెలిపారు. హెల్త్ సమస్యలతో ఏడాది బ్రేక్ తీసుకున్నప్పుడు.. నటనకు బ్రేక్ ఇవ్వాలన్న డాక్టర్ల సూచనతో నమ్మకం ఉన్న కొన్ని వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టానని ఆమె చెప్పారు. వ్యాపారవేత్తగా మారిన తర్వాత జీవితాన్ని ఎంతో ఆస్వాదిస్తున్నానని తెలిపారు. అనారోగ్యం వల్ల ‘సిటాడెల్’ షూటింగ్ చేయడం చాలా కష్టంగా అనిపించిందన్న సమంత.. ‘మా ఇంటి బంగారం’ సినిమాకి మొదట నిర్మాతగా మాత్రమే ఉండాలనుకున్నాననీ.. రాజ్ ప్రోత్సాహంతో నటించానని తెలిపారు.



