← Back to news

ఆ దొంగలను వదలను: ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర

By Venkat Kathari· 22 Aug 2026
ఆ దొంగలను వదలను: ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర

గుంటూరు జిల్లా,పెదకాకాని శివాలయంలో అమ్మవారి మంగళసూత్రం మాయం వెనుక కుట్ర కోణం ఉందని, ఇంటి దొంగలను వదలనని పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ స్పష్టం చేశారు. శనివారం గుంటూరులో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రాజకీయ దురుద్దేశంతో విచారణను తప్పుదారి పట్టించేలా కొందరు ఆరోపణలు చేయడంపై తీవ్రంగా మండిపడ్డారు. దర్యాప్తు ముగిసేవరకు అందరూ సంయమనం పాటించాలని కోరారు.

More in Local