పైలట్ లేకుండానే 5 వేల కి.మీలు నడిచిన విమానం

అమెరికాకు చెందిన జాబీ ఏవియేషన్ సంస్థ పైలట్ కంట్రోల్ లేకుండా విమానాన్ని విజయవంతంగా నడిపింది. కాలిఫోర్నియాలోని కాంకర్డ్ నుంచి నార్త్ కరోలినా వరకు 3,199 మైళ్లు (సుమారు 5,148 కి.మీ) ప్రయాణించింది. టేకాఫ్, గాల్లో ప్రయాణం, ల్యాండింగ్.. అన్నీ సిస్టమ్‌నే చూసుకుంది. మధ్యలో ఉరుములు, మెరుపులు ఎదురైనా రూట్‌ను మార్చుకుని సేఫ్‌గా గమ్యానికి చేరింది. ఈ టెక్నాలజీ భవిష్యత్తులో సరుకులు, వైద్య సేవల రవాణాకు ఉపయోగపడుతుందని సంస్థ తెలిపింది.



