క్షణాల్లో మారిన వాతావరణం.. తుఫాన్‌తో బీభత్సం
TG: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం మొరంపల్లి బంజరలో ఆర్నాభ్ తుఫాన్ ప్రభావంతో భారీగా గాలులు వీచాయి. దీంతో చుట్టూ దుమ్ము కమ్ముకుని, ఆకాశం నల్లని మేఘాలతో కప్పుకుపోయింది. బలమైన గాలులకు చెట్లు, రేకులు ఎగిరిపడ్డాయి. గాలి తీవ్రతకు కొందరు వ్యక్తులు కూడా కిందపడినట్లు స్థానికులు తెలిపారు. ఈ ఘటనలో పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. తుఫాన్ తీవ్రతను చూసి భయాందోళనకు గురైనట్లు బాధితులు తెలిపారు.



