కూతుళ్ల చదువు కోసం.. అమ్మ మారథాన్‌లో గెలిచింది!
మహారాష్ట్ర బీడ్ జిల్లాలోని అంబాజోగైకి చెందిన రమాబాయి రణ్‌వీర్ (47) మారథాన్‌లో సత్తా చాటారు. చీరలో, ముందుగా చెప్పులతో రేసులో పాల్గొన్న ఆమె.. చెప్పులు జారిపోవడంతో చేతిలో పట్టుకుని బేర్‌ఫుట్‌గా పరుగెత్తారు. స్పోర్ట్స్ షూస్‌తో బరిలోకి దిగిన యూత్‌ను క్రాస్ చేసి ఫస్ట్ ప్లేస్ సాధించారు. ‘అమృత్ దౌడ్’లో గెలిచిన ఆమె రూ. 3వేల ప్రైజ్ మనీతో పాటు ట్రోఫీ కూడా గెలుచుకున్నారు. ఈ మొత్తాన్ని తన ఇద్దరు కూతుళ్ళ చదువులకు ఖర్చు చేయనున్నారు. ఆర్థిక కష్టాలున్నా పిల్లలకు మంచి చదువు చెప్పాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నారు.

