రోబోలే రోబోలను తయారు చేస్తున్నాయ్!

చైనాకు చెందిన ఎలక్ట్రిక్ వాహనాల సంస్థ XPENG రోబోల తయారీలో కొత్త అడుగు వేసింది. గ్వాంగ్‌జౌలో ప్రపంచంలోనే తొలి Automated Humanoid Robot Production Lineను ప్రారంభించింది. ఇక్కడ రోబోల తయారీలో 80 శాతానికిపైగా పనులు ఆటోమేషన్ ద్వారా జరుగుతున్నాయి. తొలి ‘IRON’ హ్యూమనాయిడ్ రోబో అసెంబ్లింగ్ పూర్తయ్యాక, తనంతట తానే Production Line నుంచి బయటకు వచ్చింది. 2026 చివరి నాటికి IRON రోబోల భారీ ఉత్పత్తి ప్రారంభించాలని XPENG లక్ష్యంగా పెట్టుకుంది.



