← Back to news

పాత గనుల నీటితో AI కూలింగ్?

By Nani eluri· 23h ago· Psu
పాత గనుల నీటితో AI కూలింగ్?

AI డేటా సెంటర్లలో సర్వర్లు పనిచేసే టైంలో భారీగా వేడి ఉత్పత్తి అవుతుంది. ఈ వేడిని తగ్గించేందుకు నీరు, విద్యుత్ ఎక్కువగా అవసరం. దీనికి ప్రత్యామ్నాయంగా పాత గనుల్లో నిలిచిన నీటిని ఉపయోగించవచ్చా అని అమెరికా శాస్త్రవేత్తలు పరిశోధించారు. పెన్సిల్వేనియాలోని మోరియా గనిలో దీనిపై పరిశీలన చేశారు. గనుల్లోని నీటితో డేటా సెంటర్లను చల్లబరచే అవకాశం ఉందని గుర్తించారు. అయితే నీటి నాణ్యత, ఖర్చు, పర్యావరణ ప్రభావం, అవసరమైన సదుపాయాలపై ముందుగా పరిశీలన చేయాల్సి ఉందని తెలిపారు.

More in Technology

AI మ్యాజిక్.. 60 సెకన్లలో 60 హెల్త్ టెస్టులు
Technology· 3d ago

AI మ్యాజిక్.. 60 సెకన్లలో 60 హెల్త్ టెస్టులు

AP: మంగళగిరి ఇందిరానగర్ అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్‌లో AI పవర్‌తో పనిచేసే <a href="https://www.etvbharat.com/amp/en/state/ai-clinic-in-andhra-pradesh-to-deliver-60-health-test-reports-in-just-60-seconds-enn26090904476">వెల్‌నెస్ క్లినిక్‌</a> అందుబాటులోకి రానుంది. Aeros Innovation, IIVPL కలిసి ఏర్పాటు చేసిన ఈ పైలట్ ప్రాజెక్ట్‌లో జస్ట్ 60 సెకన్లలో 60 రకాల హెల్త్ టెస్ట్‌ల డిజిటల్ రిపోర్ట్స్‌ పొందొచ్చు. ఫేస్ స్కాన్ ద్వారా 28 టెస్టులకు బ్లడ్ శాంపిల్ అవసరం లేకుండానే రిజల్ట్స్ ఇస్తుంది. IoT టెక్నాలజీతో మరో 32 టెస్టులు చేయొచ్చు. బీపీ, డయాబెటిస్, హార్ట్ ప్రాబ్లమ్స్, కొన్ని లాంగ్‌టర్మ్ హెల్త్ ఇష్యూస్‌ను ముందుగా గుర్తించడమే దీని టార్గెట్.