AIతో జాగ్రత్త.. సత్యనాదెళ్ల సెన్సేషనల్ పోస్ట్!

AI దుర్వినియోగం వల్ల సైబర్ దాడులు, అక్రమ నిఘా, బయోవెపన్స్ తయారీ పరిశోధనలు జరుగుతున్నాయనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఆంథ్రోపిక్ CEO డారియో అమోడెయ్, ఓపెన్AI సామ్ ఆల్ట్‌మన్, ఎలాన్ మస్క్ లాంటి వారు AI ప్రమాదకరమని చెప్పారు. మైక్రోసాఫ్ట్ CEO సత్యనాదెళ్ల కూడా ఈ ఒపీనియన్‌ని సమర్థిస్తూ xలో పోస్ట్ చేశారు. ‘‘మనం డెవలప్ చేస్తున్న AI.. మనుషులకు యూజ్ అవ్వకపోతే, కంట్రోల్‌లో లేకపోతే దానిపై ఫోకస్ పెట్టడంలో అర్థం లేదు’’ అని ఆయన అన్నారు. AI వేగాన్ని కంట్రోల్ చెయ్యాలనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.



