యోగా క్రీడాకారులకు గుడ్‌న్యూస్.. రేపే జిల్లాస్థాయి పోటీలు

TG: మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఆదివారం జిల్లాస్థాయి యోగా పోటీలు నిర్వహించేందుకు నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు. ట్రినిటీ హైస్కూల్‌లో జరిగే ఈ పోటీల్లో ఆర్టిస్టిక్, రిథమిక్, ట్రెడిషనల్ విభాగాల్లో పోటీలు నిర్వహించనున్నట్లు ప్రిన్సిపాల్ జాన్ థామస్, రాష్ట్ర యోగాసన స్పోర్ట్స్ అధ్యక్షుడు అక్కల తిరుపతివర్మ, కార్యదర్శి మండ శ్రీనివాస్ తెలిపారు. వివిధ ప్రాంతాల నుంచి ఆసక్తి ఉన్న యోగా క్రీడాకారులు పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించాలని నిర్వాహకులు కోరారు.



