"జీతాలెక్కడ?".. భగ్గుమన్న మున్సిపల్ కార్మికులు

TG: వికారాబాద్ మున్సిపల్ కార్మికులు తమకు 3 నెలలుగా జీతాలు ఇవ్వట్లేదని నిరసిస్తూ ధర్నా, ర్యాలీ చేపట్టారు. ఇందులో BRS నాయకులు, అడ్వకేట్ చైతన్య కిరణ్ పాల్గొన్నారు. స్పీకర్ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో, ఆయన కూతురు చైర్మన్‌గా ఉన్న వికారాబాద్‌లో తాము జీతాల కోసం రోడ్డెక్కాల్సి వస్తోందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రజల ఆరోగ్యం కోసం శ్రమిస్తున్న తమ పెండింగ్ జీతాలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. కార్మికుల న్యాయమైన పోరాటానికి BRS పూర్తి మద్దతు ఇస్తుందని చైతన్య కిరణ్ అన్నారు.

