48 కిలోల బంగారు గణేశుడు.. అదిరిపోయే లుక్!

TG: హైదరాబాద్ నగరం బేగంబజార్‌లోని ఫీల్డ్‌ఖానాలో ఏర్పాటు చేసిన 48 కిలోల గణేశ విగ్రహం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. 24 క్యారెట్ల బంగారు పూతతోపాటు 3.8 లక్షలకు పైగా అమెరికన్ వజ్రాలతో ఈ విగ్రహాన్ని అలంకరించారు. ఎనిమిది మంది నిపుణులైన కళాకారులు 8 నెలల పాటు శ్రమించి ఈ విగ్రహాన్ని రూపొందించారు. బంగారు గణనాథుడిని చూసేందుకు భక్తులు, ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు.


