వినాయకుడి వద్దా రాజకీయాలే! పూజ లేకుండానే నిమజ్జనం!
TG: రంగారెడ్డి జిల్లా, షాద్‌నగర్.. పీర్జాపూర్ గ్రామం.. వినాయక చవితి వేడుకల్లో రాజకీయాలు, వర్గ విభేదాలు తలెత్తాయి. ఆంజనేయ స్వామి ఆలయానికి ఒక వర్గం విగ్రహాన్ని తేగా, సర్పంచ్ అధ్వర్యంలోని మరో వర్గం వ్యతిరేకించింది. టెన్షన్ పెరగడంతో పోలీసులు ఎంటరయ్యారు. ఆంజనేయ స్వామి ఆలయంలో విగ్రహం పెట్టొద్దని ఆదేశించారు. విగ్రహాన్ని తెచ్చిన వర్గం తీవ్రంగా ఫీలైంది. దేవుడి విషయంలోనూ పాలిటిక్స్ ఏంటంటూ.. తాము తెచ్చిన గణపతికి ఎలాంటి పూజలూ చేయకుండానే గ్రామ చెరువులో నిమజ్జనం చేసింది.



