కోతుల బెడద.. చిన్నారుల ఆవేదన
హుస్నాబాద్ టీచర్స్ కాలనీలో కోతుల బెడదతో చిన్నారులు భయాందోళనకు గురవుతున్నారు. ఇంటి నుంచి బయటకు వెళ్లినా, పాఠశాలకు నడుచుకుంటూ వెళ్లినా కోతులు వెంటపడి దాడి చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. స్కూల్ బ్యాగులు చూసి కోతులు వెంబడిస్తున్నాయని, దసరా సెలవుల్లోనూ ఆడుకోలేకపోతున్నామని తెలిపారు. తమను కాపాడాలంటూ మున్సిపల్ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. అధికారులు స్పందించి కోతుల బెడదను తొలగించాలని కాలనీవాసులు కోరుతున్నారు.



