అభిజిత్ దీప్కేపై సిరా (ఇంక్) దాడి!
ఢిల్లీలో నిరసనల మధ్య మాట్లాడుతుండగా 'కాక్‌రోచ్ జనతా పార్టీ' ఫౌండర్ అభిజిత్ దీప్కేపై ఒక వ్యక్తి సడన్‌గా నల్ల సిరా (ఇంక్) చల్లింది. ఈ దాడితో అక్కడ ఒక్కసారిగా తీవ్ర టెన్షన్ వాతావరణం నెలకొంది. దీనిపై 'Cockroach is Back' అఫిషియల్ హ్యాండిల్ సోషల్ మీడియాలో స్పందిస్తూ.. "ఈ గవర్నమెంట్ మాపై ఎన్ని దాడులు చేయించినా మేము భయపడబోము. మేము బాబాసాహెబ్ అంబేద్కర్ బిడ్డలం, దేనికీ వెనకడుగు వేసేదే లేదు.. జై భీమ్!" అంటూ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. ఈ ఇంక్ ఎటాక్ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్‌గా మారింది.


