ITC గ్లోబల్ పేరుతో భారీ స్కామ్!

క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెడితే రెండేళ్లలో డబ్బు రెట్టింపు అవుతుందని నమ్మించి సుమారు 500 మందిని మోసం చేసినట్లు ఆదిలాబాద్ పోలీసులు గుర్తించారు. ఈ కేసులో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఇద్దరిని అరెస్ట్ చేశారు. కొత్తవారిని పథకంలో చేరిస్తే కమీషన్ ఇస్తామని కూడా ఆశ చూపినట్లు తెలిపారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో బాధితులు ఉన్నట్లు అనుమానిస్తున్నారు. ఈ మోసంలో 10 కోట్లకు పైగా నష్టం జరిగినట్లు పోలీసులు అంచనా వేస్తున్నారు. కేసుపై దర్యాప్తు కొనసాగుతోంది.



