ప్రవక్త బోధనలు ప్రతిఒక్కరికీ ఆదర్శం: ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి

TG: మహమ్మద్ ప్రవక్త బోధించిన శాంతి, దయ, కరుణ, సోదరభావం ప్రతి ఒక్కరిలో ఉండాలని ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి అన్నారు. రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలం జహంగీర్‌పీర్ దర్గాలో ఈద్ మిలాద్ ఉన్ నబీ పర్వదినాన్ని పురస్కరించుకుని నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రవక్త మహమ్మద్ అందించిన మానవతా సందేశాలను ఎమ్మెల్సీ కొనియాడారు. సమాజంలో శాంతి, సౌభ్రాతృత్వం పెంపొందించేందుకు ప్రవక్త చూపిన మార్గాన్ని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు.


