← Back to news

ప్రమాదాల నివారణకు రేడియం స్టిక్కర్లు

By syed joharulla· 1h ago· Cumbum (Ct), Cumbum, Markapuram
ప్రమాదాల నివారణకు రేడియం స్టిక్కర్లు

AP: ప్రకాశం జిల్లా కంభం పట్టణంలోని NH-544 పై ప్రమాదాల నివారణకు పోలీసులు చర్యలు చేపట్టారు. ప్రమాదకరంగా ఉన్న “U” టర్న్‌ వద్ద కంభం మండలం ఎస్సై శివకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో రేడియం స్టిక్కర్లు ఏర్పాటు చేశారు. రాత్రివేళల్లో టర్న్‌ స్పష్టంగా కనిపించేలా స్టిక్కర్లను అమర్చారు. వాహనదారులను ముందుగానే అప్రమత్తం చేసి, వేగాన్ని తగ్గించేలా చేయడమే లక్ష్యమని ఎస్సై శివకృష్ణారెడ్డి తెలిపారు. రేడియం స్టిక్కర్లతో ప్రమాదాల నివారణకు అవకాశం ఉంటుందని చెప్పారు. కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

More in Local